Nov 04,2023 16:32

మధిర: మేడిగడ్డ బ్యారేజీ సేఫ్టీ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం ఖమ్మం జిల్లా మధిరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్ముందు కూడా బ్యారేజీతో ముప్పు ఉందని కేంద్ర బఅందం చెప్పిందన్నారు. ''మొత్తం బ్యారేజీ పనిచేయని స్థితికి వచ్చింది. ఏడో బ్లాక్‌ రిపేరు చేయడానికి వీలుగా లేదని నేషనల్‌ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ చెప్పింది. మొత్తం బ్లాక్‌ని పునాదులతో సహా తొలగించి పునర్‌నిర్మించాలని సూచించింది. సమస్య పరిష్కరించేంత వరకు బ్యారేజీని ఉపయోగించే పరిస్థితి కూడా లేదని కేంద్ర బఅందం తెలిపింది. ఒక వేళ ఉపయోగిస్తే మొత్తం బ్యారేజీని మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి రావొచ్చని బృందం చెప్పింది'' అని భట్టి విక్రమార్క తెలిపారు.