ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం నగరంలో మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించుకుని అశోక్ నగర్, సాయి నగర్‌లో మేయర్ మొహమ్మద్ వసీం నేతత్వంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వసీం మాట్లాడుతూ.. సర్వోన్నతమైన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త అని అల్లాహ్ సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని సర్వమతాల సారాంశం ఒకటేనని ఆయన తెలియజేశారు. మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా మారిందని ఇదే సంస్కతిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం, తదితరులు పాల్గొన్నారు










