ప్రజాశక్తి-మడకశిర రూరల్ (అనంతపురం) : మడకశిర పట్టణంలోని ఆర్య పేటలో మంగళవారం మట్కా నిర్వాహకులపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. మట్కా నిర్వాహకుడు మసాజ్ చారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. 11,3401 మట్కా పేపర్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు. మట్కా సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.










