Aug 08,2023 21:48
  • ఐదు రోజుల్లోనే రిటైర్మెంట్‌ వెనక్కి

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌ క్రీడా శాఖ మంత్రి మనోజ్‌ తివారీ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. మాజీ క్రికెటర్ల అభ్యర్థన మేరకు తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించాడు. దీంతో మళ్లీ రంజీ ట్రోఫీలో బెంగాల్‌ తరఫున ఆడనున్నాడు. గురువారం (ఆగస్టు 3) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తివారీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రంజీల్లో మెరుగైన రికార్డు కలిగిన తివారీ పది వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 98 పరుగులు చేస్తే.. 10 వేల క్లబ్‌లో చేరనున్నాడు.