Oct 15,2023 17:10

ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూలు) : తుగ్గలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి బి.మానస రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎస్‌.చందు నాయక్‌ ఆదివారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా అండర్‌ 18 పగిడియాలలో జరిగిన జిల్లా స్థాయి ఖోఖో పోటీలలో తుగ్గలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బి.మానస చిత్తూరు జిల్లా యాదమర్రి లో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో కి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి తుగ్గలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఖోఖో పోటీలలో ప్రతిసారి విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్రస్థాయికి బి.మానస ఎంపిక కావడం హర్షించదగ్గ విషయం. ఈ ఎంపిక పట్ల సచివాలయం కన్వీనర్‌ మోహన్‌రెడ్డి, తుగ్గలి సర్పంచ్‌ రామాంజనేయులు, ప్రదానోఉపాధ్యాయులు జయలక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్‌ మల్లికార్జున, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.