Sep 13,2023 13:28

ప్రజాశక్తి-గుత్తి (అనంతపురం) : మండలంలోని తురకపల్లి గ్రామ సమీపంలో రైల్వే వంతెన వద్ద బుధవారం రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 40 ఏళ్లు ఉన్న ఆ వ్యక్తి ప్యాంటు, షర్టు ధరించి ఉన్నాడని జీఆర్పీ పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప, హెడ్‌ కానిస్టేబుల్‌ వాసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మఅతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.