ప్రజాశక్తి-మద్దికేర (కర్నూలు) : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పత్తికొండ టిడిపి ఇన్చార్జ్ శ్యాం బాబు ఆదేశాల మేరకు ఏం అగ్రహారంలోని శ్రీశ్రీ అవధూత పకరప్ప స్వామి దేవాలయం నుంచి మద్దికేర మెయిన్ బజార్ వరకు మంగళవారం సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు టిడిపి కర్నూల్ పార్లమెంటరీ కార్యదర్శి గూడూరు ధనంజయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు ఏ ఆధారాలు లేకుండా జైల్లో ఉన్న చంద్రబాబు కడిగిన ముత్యంలా త్వరగా జైలు నుండి తిరిగి రావాలని పకీరప్ప స్వామిను దర్శించుకుంటున్నట్లు తెలిపారు. మండలంలో ఉన్న ప్రతి టిడిపి కుటుంబ సభ్యులు టిడిపి అభిమానులు నేడు జరగబోయే పాదయాత్రను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో మన నియోజకవర్గంలో టిడిపి జండా ఎగరాలని టిడిపి కార్యకర్తల బలమేమిటో చూపించాలని తెలియజేశారు.










