Apr 16,2023 12:09

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజవర్గ టిడిపి పరిశీలకునిగా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాక కార్యదర్శిగా ఉన్న లుక్కా సాయిరాం ప్రసాద్‌ గౌడ్‌ని నియమిస్తు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చం నాయుడు నియామక పత్రాలు అందజేశారు. మచిలీపట్నం నియోజకవర్గానికి మాజీ మంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యులు, కొల్లు రవీంద్ర ఇన్చార్జిగా ఉన్నారు. లుక్కా, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రుడు బిసి కుల సంఘాలకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా లుక్కా సాయిరాం మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో పార్టీ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు కేంద్ర పార్టీ కార్యాలయానికి సమాచారం ఇస్తూ, పార్టీ బలోపేతానికి, పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాకు ఈ భాధ్యతను అప్పగించినందుకు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ,రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చం నాయుడు ,పొలిట్‌ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు.