Oct 23,2023 12:15

రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు సోమవారం ములాఖత్‌ అయ్యారు. నారా లోకేశ్‌, బ్రాహ్మణితో పాటు టిడిపి నేత సత్యనారాయణ రాజు కూడా చంద్రబాబును కలిశారు. ఈ ములాఖత్‌ లో భాగంగా తాజా రాజకీయ పరిణామాలతోపాటు న్యాయపరమైన అంశాలపై చంద్రబాబుతో చర్చించనున్నారు. అయితే ఈరోజు టిడిపి-జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ... ఈ ములాఖత్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 40 నిమిషాలపాటు ములాఖత్‌ కొనసాగనుంది..