Oct 24,2023 10:26

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : మాజీ సిఎం చంద్రబాబు అరెస్టు అక్రమమని వెంటనే విడుదల చేయాలని టిడిపి సీనియర్‌ నాయకులు ఉమాపతి నాయుడు డిమాండ్‌ చేశారు. సోమవారం రాత్రి ఆదోనిలోని ' మనం చేద్దాం జగనాసుర దహనం ' కార్యక్రమంలో భాగంగా సైకో పోవాలి అంటూ ప్రతులను దహనం చేశారు. అంతకుముందు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిడిపి-జనసేన వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసి జైల్లో నిర్బంధించడం ప్రభుత్వానికి తగదని దుయ్యబట్టారు. వయసు మీద పడ్డ వ్యక్తి పట్ల కనీసం మానవత్వం కూడా చూపని దుస్థితిలో పాలకులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగస్వామి నాయుడు, రామస్వామి, వీరేష్‌, జయరాం, ఆరిఫ్‌, ఈరన్న, మల్లికార్జున, అంజి, తదితరులు ఉన్నారు.