ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : బాల్య వివాహాలు ఒక సామాజిక రుగ్మత, నిర్మూలనకు కృషి చేద్దామని కర్నూల్ నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భార్గవ్ తేజ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్.బి. ఐ కాలనీ లోని, నగర పాలక న్యూ కౌన్సిల్ హల్ నందు ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహ నిరోధక నిబంధనలు 2023 పై, వార్డు సచివాలయ పరిపాలన, మహిళ - శిశు సంరక్షణ కార్యదర్శులకు అవగాహణ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో కమిషనర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ.. బాల్య వివాహాల సామాజిక రుగ్మతను నిర్మూలించే బృహత్తర బాధ్యత అందరి పై ఉందని, బాల్య వివాహాల నిర్మూలన ద్వారానే మాత, శిశు మరణాలను పూర్తిగా నిరోధించడం సాధ్యమని, కాబట్టి కార్యదర్శులు అందరూ తమ పరిధిలో ప్రజలకు విస్తృత అవగాహణ కల్పిస్తూ, నిఘా ఉంచాలని కోరారు.ఈ సదస్సులో ఎస్. బి. సి .సి.కోఆర్డినేటర్ శ్రీనివాసులు , సిడిపిఓ జి .అనురాధ , సామాజిక కార్యకర్త ఉషా రాణి పాల్గొన్నారు.










