కోకోలొద్దు... కోలాలొద్దు...
రస్నాలొద్దు ... రంగునీళ్లొద్దు...
బండిమీదమ్మే బొండ బజ్జీలొద్దు
కెఫిన్ వుండే కాఫీ టీ లొద్దు
బోండంలోని కొబ్బరినీళ్లు
చలాకీనిచ్చే చెరకుగడ రసం
చలువచేసే తాటిముంజలు
సాఫీగా అరిగే సీజనల్ పండ్లు
పెరుగు చిలికిన పలుచటి మజ్జిగ
మొక్కలు మొలచిన పప్పులు, గింజలు
వీటినే కొందాం.. వెంటనే తిందాం..
ఆరోగ్యంగా ఉందాం.. ఆనందంగా ఉందాం..
- డాక్టర్ దార్ల బుజ్జిబాబు,
9290504570










