Aug 27,2023 09:26

'కుడి ఎడమైతే పొరపాటులేదోరు..!' కవి అన్నట్లు.. మనలో కొందరు ఎడమ చేతిని ఎక్కువగా ఉపయోగించే అలవాటు ఉంది. అలా వాళ్లు ఎందుకు ఎడమచేతిని ఉపయోగిస్తారు అన్న ప్రశ్నకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు జన్యుపరమైన కారణాల్ని ముందుకు తెచ్చారు.
మొదట వారు ఎడమచేతి అలవాటు తో సంబంధం ఉన్న జన్యు పదార్థాన్ని గుర్తిం చారు. మెదడు నిర్మాణం, పనితీరు విషయం లో దీని ప్రభావం అధికంగానే ఉంటుందని వారు చెప్తున్నారు. ప్రపంచంలోని ప్రతి పది మందిలో ఒకరిది ఎడమ చేతి అలవాటేనంట! కవల పిల్లలపై ఇది వరకు జరిగిన అధ్యయ నాలు ఎడమచేతి అలవాటుకు జన్యుసం బంధం ఉందని గుర్తించాయి. అయితే, లోతైన వివరాలు మాత్రం తాజా అధ్యయనం లోనే బయటపడుతున్నాయి.
యూకే బయోబ్యాంక్‌లో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది జన్యుక్రమాల సమాచారం ఉంది. వీరిలో 38 వేల మంది ఎడమచేతి అలవాటు ఉన్నవాళ్లు ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకుల బృందం వీరందరి జన్యు క్రమాలను విశ్లేషిం చింది. వాటిలో కుడిచేతి అలవాటున్నవారికి, ఎడమచేతి అలవాటున్న వారికి మధ్య తేడాలున్న ప్రాంతాల్ని గుర్తించింది.
'కుడి, ఎడమ చేతి అలవాట్లను నిర్ణయించే ఓ జన్యు పదార్థం ఉందని మనకు ఇప్పుడే తెలిసింది' అని ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ గ్వానెల్లే డావుడ్‌ వెల్లడించారు. శరీరంలోని కణాల అంతర్గత నిర్మాణంలో సైటోస్కెలెటన్‌ అనే పదార్థం కీలకపాత్ర పోషిస్తుందని, ఏ చేతి అలవాటన్నది నిర్ణయించే జన్యు పరివర్తనాలు దీనిలోనే కనిపించాయని పరిశోధకులు చెప్పారు. మెదడులో ఉండే వైట్‌ మ్యాటర్‌ నిర్మాణంలో మార్పులకు సైటోస్కెలెటన్‌ కారణమవుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని వారు వివరించారు.
నత్తల్లోనూ ఎడమ, కుడివి ఉంటాయి. వాటిలోని సైటోస్కెలెటన్‌ను ఇలాంటి పరివర్తనాలే మార్చుతున్నాయి.
'సైటోస్కెలెటన్‌్‌ వల్ల వచ్చే తేడాలు మెదడులో కనిపిస్తున్నాయి. మొదటిసారి వీటికీ, చేతి అలవాటుకు మధ్య సంబంధాన్ని గుర్తించాం' అని ప్రొఫెసర్‌ డావుడ్‌ అన్నారు. కుడిచేతి అలవాటు వారితో పోలిస్తే ఎడమ చేతి అలవాటున్న వారిలో మెదడులోని కుడి, ఎడమ భాగాలు మెరుగ్గా అనుసంధానమై ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
మెదడులో భాషా జ్ఞానానికి సంబంధించి ప్రాంతాలూ మెరుగ్గా అనుసంధానమై ఉన్నాయని, అందుకే ఎడమచేతి అలవాటున్న వారికి మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు అంటున్నారు.
కుడిచేతి అలవాటున్న వారి కన్నా ఎడమచేతి అలవాటున్న వారికి స్కిజోఫ్రీనియా అనే వ్యాధి వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని, పార్కిన్సన్స్‌ వ్యాధి వచ్చే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని పరిశోధకులు వివరించారు. సమాజంలో ఎడమచేతి అలవాటున్న వారికి ఇప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. 'చాలా సంస్కృతుల్లో ఎడమచేతి అలవాటున్నవారిని చులకనగా చూస్తారు. వారిని దురదృష్టవంతులుగా భావిస్తారు. ఆ వివక్ష ఆనవాళ్లు భాష లోనూ కనిపిస్తుంటాయి' అని శస్త్ర చికిత్స నిపుణులైన ప్రొఫెసర్‌ డొమినిక్‌ ఫర్నీస్‌ చెప్పారు. ఫ్రెంచ్‌ పదం స్త్రaబషష్ట్రవ కు రెండు అర్థాలున్నాయి. వాటిలో ఒకటి ఎడమ, రెండు అయోమయం. ఇక ఇంగ్లీష్‌లో తీఱస్త్రష్ట్ర్‌ అంటే కుడితోపాటు సరైనది అనే అర్థం ఉంది.
'ఎడం చేతి అలవాటు మన మెదడు వద్ధి చెందే క్రమంలో వచ్చే పరిణామం అని ఈ అధ్యయనం చెబుతోంది.దురదృష్టం, దుష్టశక్తు లతో దానికి ఎలాంటి సంబంధమూ లేదు' అని ఫర్నీస్‌ అన్నారు.
ఈ అధ్యయనంలో కేవలం ఎడం చేతి అలవాటుతో సంబంధమున్న జన్యుపదార్థంలో ఒక్క శాతం గురించి మాత్రమే సమాచారం తెలిసింది. పైగా బ్రిటన్‌లో ఉండేవారి జన్యు సమాచారంపైనే పరిశోధకులు దృష్టి సారించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారి జన్యు సమాచారాన్ని విశ్లేషించినా.. ఎడం చేతి అలవాటుకు కారణాలు పూర్తిగా తెలియవు.
ఎందుకంటే, ఈ అలవాటుకు పూర్తిగా జన్యువులే కారణం కాదు. వాటి ప్రభావం 25 శాతం మాత్రమే. మరో 75 శాతం వరకూ మనుషులు పెరిగిన వాతావరణం లాంటి ఇతర కారణాలే ఏ చేతి అలవాటన్నది నిర్ణయిస్తాయని కూడా పరిశోధకులు చెప్తున్న మాట.