ఇటీవలే కెనడా ఓపెన్‌ను గెలిచిన భారత స్టార్ షెట్లర్ లక్ష్యసేన్ తన జోరును కొనసాగిస్తున్నాడు. యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో లక్ష్యసేన్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శంకర్ ముత్తుస్వామిపై 21-10, 21-17తో వరుస గేముల్లో గెలిచిన లక్ష్యసేన్ సెమీస్‌కు చేరుకున్నాడు. మరోవైపు పీవీ సింధు మాత్రం క్వార్టర్స్‌లోనే ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన గావో ఫాంగ్ జీ చేతిలో 22-20, 21-13తో సింధు ఓటమి పాలయ్యింది.










