Jul 16,2023 22:01

యుఎస్‌ ఓపెన్‌ సూపర్‌300
న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. సెమీస్‌కు చేరిన ఏకైక షట్లర్‌ లక్ష్యసేన్‌ ఓటమిపాలయ్యాడు. ఆదివారం జరిగిన సెమీస్‌లో లక్ష్యసేన్‌ 17-21, 24-22, 17-21తో లీ షి ఫెంగ్‌(చైనా) చేతిలో పోరాడి ఓడాడు.ఈ మ్యాచ్‌ గంట 16 నిమిషాలసేపు సాగింది. ఫెంగ్‌పై మెరుగైన రికార్డు ఉన్న లక్ష్యసేన్‌.. ఇటీవల ముగిసిన కెనడా ఓపెన్‌ ఫైనల్లో పెంగ్‌పై వరుససెట్లలో నెగ్గి టైటిల్‌ను ముద్దాడాడు. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడిన చైనా టెన్నిస్‌ స్టార్‌ రెండుసెట్లలో అధిక్యం కనబరిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దాంతో వరుసగా రెండో టైటిల్‌ నెగ్గాలనుకున్న లక్ష్యసేన్‌కు నిరాశే మిగిలింది. మహిళల సింగిల్స్‌లో పివి సింధు క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.