Jul 28,2023 22:01

క్వార్టర్స్‌లో ఓడిన ప్రణయ్ సాత్విక్‌-చిరాగ్‌ జోడీ
జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
టోక్యో: జపాన్‌ ఓపెన్‌ సూపర్‌750 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ దూసుకెళ్లగా.. హెచ్‌ఎస్‌ ప్రణరు రారు, డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ఇంటిదారి పట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్‌ 21-15, 21-19తో వటనబే(జపాన్‌)పై వరుససెట్లలో గెలుపొందాడు. సెమీస్‌లో ఇండోనేషియా ఆటగాడు జనాథన్‌ క్రిస్టీతో లక్ష్యసేన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో ప్రణయ్ రాయ్ 21-19, 18-21, 8-21తో టాప్‌సీడ్‌ విక్టర్‌ అక్సెల్సన్‌(డెన్మార్క్‌) చేతిలో పోరాడి ఓడాడు.
సాత్విక్‌-చిరాగ్‌ జోరుకు బ్రేక్‌..
భారత స్టార్‌ డబుల్స్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డిాచిరాగ్‌ శెట్టి జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. వరుసగా 12 విజయాలతో జోరు మీదున్న వీరు ఒలింపిక్‌ విజేతలైన లీయాంగ్‌ావాంగ్‌ చీ లిన్‌ చేతిలో పోరాడి ఓడారు. సుమారు గంట పది నిమిషాలు జరిగిన మ్యాచ్‌లో 15-21, 25-23, 16-21తో అనూహ్యంగా పరాజయం చెందారు. దీంతో, ఎనిమిదో బిడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ నెగ్గాలనుకున్న వీరి కల ఫలించలేదు. ఇక మహిళల సింగిల్‌ సెమీస్‌కు తైజుాయింగ్‌(తైపీ), సన్‌యే యంగ్‌(కొరియా)తోపాటు టంగ్‌జంగ్‌(మలేషియా), హీాబింగ్జియావో(చైనా) దూసుకెళ్లారు.