Jul 15,2023 22:07

యుఎస్‌ ఓపెన్‌ సూపర్‌300
న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ సూపర్‌ా300 బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీఫైనల్లోకి భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత్‌కే చెందిన 19ఏళ్ల ఎస్‌.శంకర్‌ ముత్తుస్వామిని ఓడించాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న లక్ష్యసేన్‌ 21-10 21-17తో ముత్తుస్వామిపై విజయం సాధించాడు. సెమీస్‌లో లక్ష్యసేన్‌ చైనా క్రీడాకారుడు లీాషిాషెంగ్‌తో ఢ కొట్టనున్నాడు. ఇటీవల ముగిసిన కెనడా ఓపెన్‌ ఫైనల్లో లక్ష్యసేన్‌, లీ షి షెంగ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
క్వార్టర్స్‌లో  సింధు ఓటమి..
మహిళల సింగిల్స్‌లో పివి సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో సింధు చైనాకు చెందిన గావో ఫాంగ్‌ జీ చేతిలో 20-22, 13-21తో ఓటమి పాలైంది. ఇప్పటివరకూ వీళ్లద్దరూ ఐదుసార్లు తలపడగా.. ఫాంగ్‌ నాలుగు విజయాలతో సింధుపై పైచేయి సాధించింది. ఈ సీజన్‌లో సింధు సెమీఫైనల్‌ చేరకపోవడం వరుసగా ఇది రెండోసారి. కెనడా ఓపెన్‌లోనూ ఆమె క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది.