Nov 12,2023 17:46

అమరావతి: ఎల్‌ఐసీ క్వార్టస్‌ సముదాయంలో ఓ ఉద్యోగి హత్య కడపలో కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌ఐసీలో భవానీ శంకర్‌, మల్లికార్జున కాంట్రక్ట్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. గత రాత్రి భవానీ శంకర్‌ ని మల్లికార్జున కొడవలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు అక్కడికక్కడే మఅతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మల్లికార్జునే హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలుస్తోంది.