ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ పట్టణ, మండల కార్యదర్శిలు సుదర్శన్, కల్లుబావి రాజు డిమాండ్ చేశారు. గురువారం కరువుపై ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖను ఆదోని మార్కెట్ యార్డులో రైతులకు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ఆర్డీఎస్ కుడి కాలువ, వేదావతి ప్రాజెక్టు నిధులు కేటాయించి పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలకు సాగు, త్రాగునీరు అందించాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎకరాకు రూ.40 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, రైతులు బ్యాంకులలో తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలని, రబీ సీజన్లో పంటలు వేయడానికి 90 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎంకన్న, వైటీ భీమేష్, షేక్షావలి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు మధురి ఎల్లప్ప, బోయ ప్రకాష్ పాల్గొన్నారు.










