Oct 30,2023 15:26

హైదరాబాద్‌ : సోమవారం మధ్యాహ్నం దుబ్బాక నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి పై సూరంపల్లిలో రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. వెంటనే ప్రభాకర్‌ రెడ్డిని కారులో గజ్వేల్‌ హాస్పిటల్‌ కు తీసుకెళ్లారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం గజ్వేల్‌ లో ఇతనికి వైద్యం చేసిన డాక్టర్లు హెల్త్‌ అప్డేట్‌ ను విడుదల చేశారు. ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.. మేము ఇతనికి ప్రాధమిక చికిత్సను అందించి మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే హైదరాబాద్‌ లోని యశోద హాస్పిటల్‌ కు తరలించామని చెప్పారు. ఇక కాసేపట్లో యశోద హాస్పిటల్‌ కు చేరుకోనున్న ప్రభాకర్‌ రెడ్డిని పరీక్షించిన అనంతరం కత్తి గాయం తీవ్రత ఏమిటి అన్నది చెప్పనున్నారు. కాగా పోలీసులు ఇప్పటికే రాజునూ అరెస్ట్‌ చేసిన దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి కావడం వలన దీనిపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.