Oct 07,2023 15:30

ఢిల్లీ : ఇజ్రాయిల్‌, హమాస్‌ మిలిటెంట్ల మధ్య భారీ యుద్దం జరుగుతోంది. దీంతో ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారత పౌరుల రక్షణ కోసం అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనల్ని జారీ చేసింది. యుద్ధస్థితి ప్రకటించబడినందున శనివారం భారతీయ పౌరులకు కొన్ని సూచనల్ని జారీ చేసింది. భారతీయులు అప్రమతంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్‌ పాటించాలని అధికారులు కోరారు. దయచేసి జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని, భద్రత ఉండే ప్రాంతాలకు దగ్గర ఉండాలని రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయిల్‌ హౌం ఫ్రంట్‌ కమాండ్‌ వెబ్సైట్‌ సందర్శించాలని, అత్యవసర పరిస్థితుల్లో వారి హెల్ప్‌లైన్‌ నంబర్‌ 97235226748 లేదా cons1.telaviv@mea.gov.in ఇమెయిల్‌ను సంప్రదించాలని ఎంబసీ అధికారులు పౌరులను కోరారు.