Aug 16,2023 14:30

ప్రజాశక్తి-కౌతాళం(కర్నూలు) : మండల కేంద్రమైన కౌతాళంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నవ్య అనే విద్యార్థికి కర్నూలు జిల్లా ఎస్‌పి కృష్ణ కాంత్‌ ప్రశంసించారని కేజీబీవీ ప్రిన్సిపల్‌ ప్రిన్సిపల్‌ పుష్పలత తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఆధ్వర్యంలో 9వ తరగతి చదువుతున్న నవ్య ఆధ్వర్యంలో పాఠశాలకు చెందిన మొత్తం పదిమంది బాలికల బృందం మార్చ్‌ ఫాస్ట్‌ పెరేడ్‌ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా ఎస్‌పి కృష్ణ కాంత్‌ నవ్యకు మెడల్‌ను అందించి అభినందించినట్లు తెలిపారు. బాలికలు విద్యతోపాటు అన్ని రంగాలలోనూ, రాణించే విధంగా తీర్చిదిద్దాలని కేజీబీవీ ప్రిన్సిపాల్‌ పుష్పలతకు సూచించినట్లు తెలిపారు.