ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఆదోనిలోని నిజాముద్దీన్ మైనార్టీ కాలనీలో మజీద్ హి హజరత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కతం-ఈ-నుబువత్ క్విజ్ పోటీలు నిర్వహించినట్లు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మజర్ అహ్మద్, మనియర్ ఇలియాస్ సాబ్ ఆదివారం తెలిపారు. ఆధ్యాత్మిక అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సత్ప్రవర్తన అలవడుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు ఆధ్యాత్మికతను అలవాటు చేయాలన్నారు. క్విజ్ పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథులుగా హాజరైన వారి చేతుల మీదుగా బహుమతులు అందజేసినట్లు తెలిపారు.










