Jan 18,2023 12:05

కదిరి (అనంతపురం) : టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారరామారావు 27 వ వర్థంతి సందర్భంగా ... బుధవారం కదిరి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి కదిరి నియోజక వర్గ ఇంఛార్జి కందికుంట వెంకట ప్రసాద్‌, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.