Oct 28,2023 15:07

ఆదిలాబాద్‌: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ' కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అభివఅద్ధి చెందిదన్నారు. కేసీఆర్‌ అంటే ఒక నమ్మకం .. కాంగ్రెస్‌ అంటే బూటకమని వివరించారు. 'కేసీఆర్‌ చావు నోట్లోకి వెళ్లి తెలంగాణ తెచ్చిండు. ఇంటింటా నళ్లా నీరు ఇచ్చాం.. కాంగ్రెస్‌లో కుర్చీల కోసం కొట్లాడే నాయకులున్నారు. కొందరు బూతులు మాట్లాడే నాయకులు ఉన్నారు. కుర్చీ కోసం కోట్లాడే నాయకులకు ఓట్లు వేద్ధామా?, మన భవిష్యత్తు వాళ్ల చేతులో పెడుదామా?' అని హరీష్‌రావు ప్రజలను ప్రశ్నించారు.