హైదరాబాద్: కాంగ్రెస్‌కు మద్దతివ్వాలంటూ వైఎస్సార్‌టీపి అధ్యక్షురాలు షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. వైఎస్‌ఆర్ బిడ్డగా కాంగ్రెస్‌తో షర్మిల కలిసి రావడం శుభపరిణామమని చెప్పారు. మరోవైపు హుజూరాబాద్‌లో ఓట్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని భట్టి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దళితబంధుకు బడ్జెట్‌లో రూ.17వేల కోట్లు కేటాయించిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఈ ఏడాది ఎంతమందికి ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలకు కేసీఆర్ ఓ కలల ప్రపంచాన్ని చూపించారన్న ఆయన.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కూడా అమలు చేయట్లేదని విమర్శించారు.










