Sep 12,2023 17:43

ప్రజాశక్తి-కోటనందూరు(కర్నూలు) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాధనాన్ని దొంగలించిన గజదొంగ చంద్రబాబు నాయుడు అని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మంగళవారం తుని రూరల్‌ ప్రాంతమైన తేటగుంట గ్రామంలో వైయస్సార్‌ గృహ నిర్మాణ పథకం ద్వారా మంజూరైన ఇల్లు పట్టాల పంపిణీ , రోడ్లు శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కుంభకోణాలను చేయడంలో చంద్రబాబు గనుడని పోలవరం, అమరావతి, పట్టిసీమ, హెరిటేజ్‌లో బెల్లం మజ్జిగ లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేశాడని అన్నారు. చంద్రబాబు పాపం పండి ఈరోజు చంద్ర జైల్లో ఊసలు లెక్కిస్తున్నారని తెలిపారు. పేద ప్రజల నిరుద్యోగ నిరుద్యోగుల స్కిల్‌ డెవలప్మెంట్‌, తిడ్కో గృహాలలో పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసి తన కొడుకు ఆయన అనుసర గలానికి ఎకౌంట్లోనికి జమ చేశాడని ఆరోపించారు. ఎన్నాళ్లకు దేవుడి దయవల్ల పాపం పండి జైలు పాలు అవ్వాలని తెలిపారు. రానున్న రోజుల్లో యనమల రామకృష్ణుడు జైలు ఊసలు లెక్కించడం ఖాయమన్నారు. సంక్షేమము అభివృద్ధి లక్ష్యంగా జగన్‌ను పరిపాలన సాగుతుందని రాష్ట్రంలో 31 లక్షల మంది అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని తేటగుంట గ్రామంలో446 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 2.10 కోట్ల రూపాయలతో పలు రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ మాకినీడు బాబు, ఎంపీపీ బొప్పన రాము, వైస్‌ ఎంపీపీ సూరిశెట్టి సత్యనారాయణ, పోతల రమణ, పోతల లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.