Jul 15,2023 09:19
  • వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

లండన్‌ : వింబుల్డన్‌ గ్రాండ్‌స్లా మ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లోకి టాప్‌సీడ్‌, స్పెయిన్‌కు చెందిన అల్కరాజ్‌, 2వ సీడ్‌, సెర్బియాకు చెందిన 36ఏళ్ల నొవాక్‌ జకోవిచ్‌ ప్రవేశించారు. శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో జకోవిచ్‌ 6-3, 6-4, 7-6(7-4)తో 8వ సీడ్‌ జన్నిక్‌ సిన్నర్‌(ఇటలీ)ను, కార్లోస్‌ అల్కరాజ్‌ 6-3, 6-3, 6-3తో 3వ సీడ్‌, రష్యాకు డానియెల్‌ మెద్వదెవన్‌ను వరుససెట్లలో ఓడించారు. తొలి సెమీస్‌లో తొలి రెండు సెట్‌లను సునాయాసంగా నెగ్గిన జకోవిచ్‌కు మూడో సెట్‌లో అనూహ్యంగా ప్రతిఘటన ఎదురైంది. ఆ సెట్‌ను టై బ్రేక్‌కు దారితీసింది. దీంతో చివర్లో వరుసగా మూడు పాయింట్లు సాధించి జకోవిచ్‌ మ్యాచ్‌ను ముగించాడు. దీంతో వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో 9వ సారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2013లో మాత్రమే రన్నర్‌గా నిలిచిన జకోవిచ్‌.. ఫైనల్‌కు చేరిన ప్రతి సందర్భంలోనూ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022లలో వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను ముద్దాడా డు. పురుషుల సింగిల్స్‌లో 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గి జకోవిచ్‌ నయా చరిత్రను నెలకొల్పాడు. అల్కరాజ్‌ గత ఏడాది యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జకోవిచ్‌, అల్కరాజ్‌ టైటిల్‌కై తలపడనున్నారు.
 

                                                                 నేడు మహిళల సింగిల్స్‌ ఫైనల్‌..

మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ శనివారం జరగ నుంది. 6వ సీడ్‌, ట్యునీషియాకు చెందిన జబీర్‌, అన్‌సీడెడ్‌, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన వోండ్రోసోవాల మధ్య టైటిల్‌పోరు జరగనుంది. సెమీస్‌లో జబీర్‌ 6-7(5-7), 6-4, 6-3తో 2వ సీడ్‌ సబలెంకను, వోండ్రోసోవా 6-3, 6-3తో అన్‌సీడెడ్‌, ఉక్రెయి న్‌కు చెందిన స్విటోలినా ఓడించి ఫైనల్‌కు చేరారు.