Sep 05,2023 14:33

ప్రజాశక్తి-హిందూపురం(అనంతపురం) : అజ్ఞానం, చీకటిలో ఉన్నా విద్యార్థులను జ్ఞానం వైపు నడిపించి వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన భాద్యత గురువలపైనే ఉందని... ఉపాద్యాయులు విద్యార్థులను అర్థం చేసుకొని వారిని సమాజంలో సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత వారిపైనే వుందని పాంచజన్య పాఠశాల అద్యక్షులు శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పాంచజన్య పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాద్యాయ వేశధారణతో పాఠశాలకు హాజరయ్యారు. వారి గురువులందరికి పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠశాలలో బోదించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ భారతరత్న డా.సర్వేపల్లి రాధాకృష్ణ గురువుగా వున్న సమయంలో విద్యార్థులను ప్రగతి పతంలో నడిపించారన్నారు. ఆయన విశ్రాంతి పొందిన అనంతరం విద్యార్థులు ఎంతో గౌరవ పదంగా ఇంటి వరకు వదిలారన్నారు. ఉపాధ్యాయులందరు సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులను మంచి బాటలో నడిపించాలన్నారు. అప్పుడే ఉపాద్యాయులకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులందరికీ విద్యార్థుల చేతుల మీదుగా జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్‌ నందకుమార్‌, ఎఓ భాస్కర్‌, హెచ్‌ఎం గాయిత్రి, పాఠశాల సూపరిటెండెంట్‌ విజయేంద్ర, ఎహెచ్‌ఎ లు శశికళ, అబ్దుల్‌ రజాక్‌, సతీష్‌ కుమార్‌, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.