మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా మూడు అర్ధసెంచరీలు కొట్టి ఆటగాళ్ల జాబితాలో భారత వికెట్ కీపర్, ఓపెనర్ ఇషాన్ కిషన్ చేరాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలోనూ అర్ధసెంచరీ బాదిన ఇషాన్.. తొలి వన్డేలో 52, రెండో వన్డేలో 55పరుగులతో సత్తా చాటాడు ఈ క్రమంలో మూడో వన్డేలోనూ అర్ధసెంచరీ పూర్తి చేసుకొని ఈ రికార్డును సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
వరుసగా మూడు వన్డేల్లో అర్ధసెంచరీలు కొట్టిన భారత బ్యాటర్లు..
1. కృష్ణమాచారి శ్రీకాంత్ : శ్రీలంకపై(1982)
2. దులీప్ వెంగ్‌సర్కార్ : శ్రీలంకపై(1985)
3. మహ్మద్ అజారుద్దీన్ : శ్రీలంకపై(1993)
4. ఎంఎస్ ధోనీ : ఆస్ట్రేలియాపై(2019)
5. శ్రేయస్ అయ్యర్ : న్యూజిలాండ్‌పై(2020)
6. ఇషాన్ కిషన్ : వెస్టిండీస్‌పై(2023)










