- ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ విడుదల
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఐసిసి విడుదల బుధవారం విడుదల చేసిన ఇషాన్ ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ సిరీస్ ఇషాన్ మూడు వన్డేల్లోనూ అర్ధసెంచరీలతో రాణించడంతో అతని ర్యాంక్ గణనీయంగా మెరుగైంది. ఇక చైనామన్ కుల్దీప్ బౌలింగ్‌లో 8 స్థానాలు మెరుగుపర్చుకొని 14 ర్యాంకులో నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన రెండు వన్డేలకు దూరమైన రోహిత్ శర్మ 11 స్థానానికి, 8వ స్థానంలో ఉన్న కోహ్లీ 9వ ర్యాంక్‌కు పడిపోయాడు.










