- చివరి వన్డేలో 200 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలుపు
ట్రినిడాడ్: వెస్టిండీస్‌తో జరిగిన మూడో, చివరి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మంగళవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో టీమిండియా 200పరుగుల తేడాతో గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 351పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో వెస్టిండీస్ జట్టు 151పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. తొలుత శుభ్‌మన్(85), ఇషాన్(77), సంజు(51), హార్దిక్(70నాటౌట్) అర్ధసెంచరీలతో కదం తొక్కారు. దీంతో టీమిండియా ఈ పర్యటనలో తొలిసారి భారీస్కోర్‌ను నమోదు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు భారత బౌలర్లు తొలినుంచే కట్టడి చేశారు. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ జట్టు 88పరుగులకే 8వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఆ తర్వాత మోటీ(39నాటౌట్), అల్జరీ జోసఫ్(26)లు తొమ్మిదో వికెట్‌కు 55పరుగులు జతచేశారు. శార్దూల్‌కు నాలుగు, ముకేశ్ కుమార్‌కు మూడు, కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. దీంతో, భారత్ 2-1తో వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ శుభ్‌మన్‌కు, సిరీస్ ఇషాన్ కిషన్‌కు లభించాయి. ఇక భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టి20ల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.
స్కోర్‌బోర్డు..
ఇండియా ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (స్టంప్)హోప్ (బి)కరియా 77, శుభ్‌మన్ (సి)కరియా (బి)మోటీ 85, గైక్వాడ్ (సి)కింగ్ (బి)జోసెఫ్ 8, సంజు (సి)హెట్‌మెయిర్ (బి)షెఫర్డ్ 51, హార్దిక్ (నాటౌట్) 70, సూర్యకుమార్ యాదవ్ (సి)కరియా (బి)షెఫర్డ్ 35, జడేజా (నాటౌట్) 8, అదనం 17. (50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 351పరుగులు.
వికెట్ల పతనం: 1/143, 2/154, 3/223, 4/244, 5/309
బౌలింగ్: సెలిస్ 8-0-75-0, మయర్స్ 4-0-25-0, జోసెఫ్ 10-0-77-1, మోటీ 10-1-38-1, షెఫర్డ్ 10-0-73-2, కరియా 8-0-58-1.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (సి)ఇషాన్ (బి)ముఖేశ్ 0, మయర్స్ (బి)ముఖేశ్ 4, అథంజే (బి)కుల్దీప్ 32, హోప్ (సి)శుభ్‌మన్ (బి)ముఖేష్ 5, కర్టీ (సి)శుభ్‌మన్ (బి)ఉనాద్కట్ 6, హెట్‌మెయిర్ (సి)సూర్యకుమార్ (బి)శార్దూల్ 4, షెఫర్డ్ (సి)ఉనాద్కట్ (బి)శార్దూల్ 8, కరియా (ఎల్‌బి)కుల్దీప్ 19, జోసెఫ్ (సి)ఇషాన్ (బి)శార్దూల్ 26, మోటీ (నాటౌట్) 39, సెలిస్ (బి)శార్దూల్ 1, అదనం 7. (35.3ఓవర్లలో ఆలౌట్) 151పరుగులు.
వికెట్ల పతనం: 1/1, 2/7, 3/17, 4/35, 5/40, 6/50, 7/75, 8/88, 9/143, 10/151
బౌలింగ్: ముఖేశ్ కుమార్ 7-1-30-3, హార్దిక్ పాండ్యా 4-1-13-0, శార్దూల్ 6.3-0-37-4, ఉనాద్కట్ 5-0-16-1, కుల్దీప్ 8-3-25-2, జడేజా 5-1-29-0.
తొలి టి20 నేడు
భారత్ × వెస్టిండీస్
(రాత్రి 8.00గం||లకు; ట్రినిడాడ్)










