Oct 10,2023 16:26

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : సాగు చేసిన పంటలకు డిసెంబర్‌ నెల ఆఖరి వరకు ఎల్‌ఎల్సీ కాలువ ద్వారా నీరు అందించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే అజయ్ బాబు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే లక్ష్మి రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్‌ సుదర్శన్‌, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆదోనిలోని టీబిపి కార్యాలయం వద్ద సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావిరాజు అధ్యక్షత సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. తాగు, సాగు నీటికి జీవనాధారమైన ఎల్‌ఎల్సీ నీటిని నవంబర్‌ మాసంలోనే నిలుపుదల చేయడానికి టిడిపి బోర్డు చర్చించడం విచారకరమన్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ బోర్డు ద్వారా రాష్ట్ర వాటా 512 టీఎంసీలు, తెలంగాణ వాటా 2009 టీఎంసీలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ట్రిబ్యునల్‌ ఆదేశాలను తెలంగాణలో వస్తున్న ఎన్నికలను దష్టిలో ఉంచుకొని మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర నీటి వాటాకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆంధ్ర రాష్ట్రానికి రావలసిన నీటి వాటాను సాధించుకోవడానికి ప్రజాప్రతినిధులు అధికారులు మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బచావత్‌ ట్రిబ్యునల్‌ 811 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి వెంకన్న సిపిఐ సహాయ కార్యదర్శి విరుపాపురం నరసప్ప, బికేఎంయు డివిజన్‌ అధ్యక్షులు గంగన్న, రైతు సంఘం కార్యదర్శి ఎల్లప్ప, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కుమారస్వామి విజరు యూసఫ్‌ కమిటీ మెకానిక్‌ వలి, శాఖ హర్షద్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు షేక్షావలి, ఏఐటియుసి వైటి భీమేష్‌, బసాపురం కరెంట్‌ ఈరన్న పాల్గొన్నారు.