లాహోర్: పాకిస్తాన్ పురుషుల క్రికెట్ సెలెక్టర్‌గా మాజీ క్రికెటర్ ఇంజమామ్-ఉల్-హక్ ఎంపికయ్యాడు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు(పిసిబి) సోమవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. అతడు తక్షణమే బాధ్యతలను అందుకోనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. త్వరలో పాకిస్తాన్ జట్టు ఆసియాకప్, ఐసిసి వన్డే ప్రపంచకప్‌లలో పాల్గొనాల్సి ఉన్న దృష్టా ఇంజమామ్ ఎంపికకు ప్రాధాన్యత సంతరించు కుంది. 2016-19 మధ్య ఒకసారి ఈ పదవిని అలంకరించిన 53ఏళ్ల ఇంజమామ్ రెండో పర్యాయం మళ్లీ జాతీయ క్రికెట్ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు. ఇక మహ్మద్ హఫీజ్, మిస్బా-ఉల్-హక్ టెక్నికల్ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు.










