Nov 08,2023 12:49

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ గ్రంధాలయ సంఘంకు అనుబంధంగా విజయవాడ శ్రీ సర్వోత్తమ భవనంలో నడుస్తున్న పాతూరి నాగభూషణం గ్రంథాలయ శిక్షణాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంవారి గుర్తింపుతో డిసెంబరు మొదటి వారం నుండి ప్రారంభమయ్యే గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికేట్‌ కోర్స్‌ శిక్షణ తరగతులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాతూరి నాగభూషణం గ్రంథాలయ శిక్షణాలయం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రావిశారద ఒక ప్రకటనలో తెలియజేశారు. నవంబర్‌ 18వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ సంస్థలో 18 సంవత్సరాలు నిండి, ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేయడానికి అర్హులు అని తెలిపారు. శిక్షణకాలం 5 మాసాలని, పాఠాలు ఇంగ్లీష్‌, తెలుగు మీడియంలలో బోధిస్తారని, ప్రభుత్వం వారి రిజర్వేషన్స్‌ పాటిస్తూ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని వివరించారు.