అనంతపురం : ప్రతి ఏడాది ఉత్తమ కవితా సంపుటాలకు ఉమ్మడి శెట్టి సత్యాదేవి సాహితీ అవార్డులను అందజేస్తున్నామని అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్ రాధేయ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఈ అవార్డులను అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది(2023)న 36 వ ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు -2023 పరిశీలన కోసం
కవులు తమ కవితా సంపుటాలను పంపించాలన్నారు. ఈ అవార్డు పరిశీలన కోసం 2023 సంవత్సరంలో ప్రచురింపబడిన కవితా సంపుటాల మొదటి ప్రచురణలు మాత్రమే పంపించాలన్నారు. ఇలా పంపించిన కవితా సంపుటాలను న్యాయ నిర్ణేతలు పరిశృలించి, ఎంపిక చేయబడిన ఉత్తమ కవితా సంపుటికి ఆరువేల రూపాయలు నగదు, షీల్డ్‌తోపాటుగా కవిని సత్కరిస్తామని వివరించారు. కవులు ఈ కవితా సంపుటాలను 10జనవరి 2024వ తేదీలోగా ఒక్కొక్కరు నాలుగు ప్రతుల చొప్పున పంపించాలన్నారు. పూర్తి వివరాలకు 9985171411 ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారు.










