అమరాపురం (అనంతపురం) : విషం తాగి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం అనంతపురంలోని అమరాపురంలో జరిగింది. అమరాపురం మండలం ఉప్పరహట్టి గ్రామానికి చెందిన సుశీలమ్మ సీతారాం దంపతుల కుమారుడు సతీష్ అమరాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి ప్రతిరోజు పోవాలి అని తల్లిదండ్రులు కుమారుడిని మందలించడంతో సతీష్ విషం తాగాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే తమ కుమారుడిని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే సతీష్ మృతి చెందినట్లు నిర్థారించారు. తమ కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










