Aug 05,2023 17:34

సిడ్నీ: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్లోకి 9వ సీడ్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో 9వ ర్యాంకర్‌ ప్రణయ్ 21-18, 21-12 స్కోర్‌తో సహచర ఆటగాడు ప్రియాన్షు రాజవత్‌పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌ను కేవలం 43 నిమిషాల్లోనే ముగించాడు. దీంతో ప్రణయ్ తొలిసారి సూపర్‌ 500 టోర్నీలో సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాకు చెందిన వెంగ్‌ హాంగ్‌ యంగ్‌తో తలపడనున్నాడు. సెమీస్‌లో వెంగ్‌- హాంగ్‌- యంగ్‌(చైనా) 21-19, 13-21, 21-13తో లీ-జి-జియా(మలేషియా)ను ఓడించాడు. ఇక మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి 7వ సీడ్‌ కిమ్‌-జె-యు(కొరియా), 4వ సీడ్‌ బివెన్‌ జంగ్‌(అమెరికా) ప్రవేశించారు. కిమ్‌-జె-యంగ్‌ 21-10, 21-11తో అయా అహోరీ(జపాన్‌)పై, బివెన్‌ జంగ్‌ 21-17, 8-3తో ఆధిక్యతలో ఉన్న దశలో 2వ సీడ్‌ ఇంటనాన్‌(మలేషియా) గాయంతో టోర్నీనుంచి నిష్క్రమించింది.