Jul 19,2023 22:01

ఆసియాకప్‌ షెడ్యూల్‌ విడుదల
లాహోర్‌: ఆసియా కప్‌ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఎసిసి) బుధవారం విడుదల చేసింది. ఆగస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్‌ 17వ ఆసియా కప్‌ా2023 టోర్నీ జరగనుంది. ఆరు దేశాలు పాల్గనే టోర్నమెంట్‌కు పాకిస్తాన్‌, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నాయి. లీగ్‌ దశ భాగంగా పాకిస్తాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు లెక్కన హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఎసిసి) నిర్ణయం తీసుకుంది. ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మొత్తం 6జట్ల మధ్య ఆసియాకప్‌ టోర్నీ జరగనుంది. ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్‌, పాకిస్తాన్‌ జట్లు గ్రూప్‌-ఎలో చోటు దక్కించుకొన్నాయి. ఈ రెండుజట్ల మధ్య సెప్టెంబర్‌ా2న శ్రీలంకలోని కాండీ మైదానంలో లీగ్‌ మ్యాచ్‌ జరగనుంది. లీగ్‌ దశ ముగిసిన అనంతరం ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌4లో ఆడనున్నాయి. సూపర్‌4లో పాకిస్తాన్‌ాభారత్‌ జట్లు తలపడాల్సి వస్తే ఆ మ్యాచ్‌కు కొలంబోలో జరగనుంది. ఫైనల్‌ మ్యాచ్‌ వేదికను ఇంకా ఖరారు చేయలేదు. టోర్నీకి పాకిస్తాన్‌ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారతజట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు బిసిసిఐ అనుమతివ్వని సంగతి తెలిసిందే.
గ్రూప్‌-ఏ: ఇండియా, పాకిస్తాన్‌, నేపాల్‌
గ్రూప్‌-బి: శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌
షెడ్యూల్‌..
ఆగస్టు 30 : పాకిస్తాన్‌ × నేపాల్‌ ముల్తాన్‌, పాకిస్తాన్‌
ఆగస్టు 31 : బంగ్లాదేశ్‌ × శ్రీలంక కాండీ, శ్రీలంక
సెప్టెంబర్‌ 2 : ఇండియా × పాకిస్తాన్‌ కాండీ, శ్రీలంక
సెప్టెంబర్‌ 3 : బంగ్లాదేశ్‌ × ఆఫ్ఘనిస్తాన్‌ లాహోర్‌, పాకిస్తాన్‌
సెప్టెంబర్‌ 4 : ఇండియా × నేపాల్‌ కాండీ, శ్రీలంక
సెప్టెంబర్‌ 5 : ఆఫ్ఘనిస్తాన్‌ × శ్రీలంక లాహోర్‌, పాకిస్తాన్‌
సెప్టెంబర్‌ 6-15: సూపర్‌4 మ్యాచ్‌లు కొలంబో, శ్రీలంక
సెప్టెంబర్‌ 17 : ఫైనల్‌