Aug 13,2023 12:12
  • మలేషియాపై 4-3తో గెలుపు
  • నాల్గోసారి టైటిల్‌ కైవసం

చెన్నై: చివరి నిమిషం వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత హాకీజట్టు మలేషియాను చిత్తుచేసిం ది. మేయర్‌ రాధాకృష్ణన్‌ సేట్డఇయంలో జరిగిన ఫైనల్లో భారతజట్టు 4-3గోల్స్‌ తేడాతో మలేషియా పై సంచలనం విజయం సాధించింది. తొలి క్వార్టర్‌లో జుగ్‌రాజ్‌ సింగ్‌ పెనాల్టీని గోల్‌గా మలచడంతో భారత్‌ 1-0తో ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత రెండో క్వార్టర్‌లో మలేషియా జట్టు భారత్‌ గోల్‌పోస్ట్‌పై వరుసగా దాడులు చేసింది. ఆ క్వార్టర్‌లో ప్రత్యర్ధిజట్టు వరుసగా మూడు గోల్స్‌ చేయడంలో భారత్‌ 1-3గోల్స్‌తో వెనుకబడింది. ఆ మూడో క్వార్టర్‌లో సుఖ్‌జీత్‌(43, 45వ ని.) వరుసగా రెండు గోల్స్‌ చేయడంతో ఆ క్వార్టర్‌ ముగిసేసరికి భారత్‌ 3-3గోల్స్‌తో సమంగా నిలిచింది. ఆ తర్వాత ఇరుజట్లు హోరాహోరీగా తలపడగా.. డిఫెన్స్‌లోనూ అద్భుతంగా రాణించాయి. ఆ తర్వాత 54వ ని.లో భారత్‌కు ఓ పెనాల్టీ లభించగా... హర్మన్‌ప్రీత్‌ గోల్‌ చేయడంలో విఫలమయ్యాడు. 56వ ని.లో ఆకాశ్‌ దీప్‌ ఒక ఫీల్డ్‌ గోల్‌ చేయడంతో భారత్‌ 4-3గోల్స్‌తో ఆధిక్యతలో నిలిచింది. లీగ్‌ దశ నుంచి భారత్‌ అప్రతిహాత విజయాలతో ఫైనల్లోకి దూసుకొచ్చి ఫైనల్లో మలేషియాపై సంచలన విజయం సాధించి రికార్డుస్థాయిలో 4వ సారి ఈ టైటిల్‌ను ముద్దాడింది.