Aug 15,2023 16:22

జస్ప్రీత్‌ బుమ్రా సారధ్యంలోని భారత జట్టు మంగళవారం ఐర్లాండ్‌కు పయనమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫోటోల్లో కెప్టెన్‌ బుమ్రాతో పాటు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌, శివమ్‌ దుబే ఉన్నారు. వీరింతా ప్రత్యేక విమానంలో ఐర్లాండ్‌కు బయలుదేరారు. మరోవైపు విండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగమైన తిలక్‌ వర్మ, అవేష్‌ ఖాన్‌, జైశ్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముఖేష్‌ కుమార్‌, సంజూ శాంసన్‌ నేరుగా ఐర్లాండ్‌కు చేరుకోనున్నారు.

ఐర్లాండ్‌ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్‌ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, సంజు శాంసన్‌ (వికెట్‌కీపర్‌), జితేష్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ అహ్మద్‌, రవి బిష్ణోరు , ప్రసిద్‌ కష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముఖేష్‌ కుమార్‌, అవేష్‌ ఖాన్‌