- వెస్టిండీస్‌తో తొలిటెస్ట్
డొమినిక : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో అరంగేట్రం యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(171) భారీ శతకానికి తోడు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(76) అర్ధసెంచరీలతో మెరిసాడు. దీంతో భారతజట్టు మూడోరోజు 5వికెట్ల నష్టానికి 421పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. లంచ్ సమయానికి 4వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసిన టీమిండియా.. ఆ తర్వాత విరాట్ కోహ్లి ఔటయ్యాక రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాడు. ఆ సమయానికి క్రీజ్‌లో జడేజా(37) ఇషాన్ కిషన్(1) ఉన్నారు. దీంతో భారతజట్టుకు 271పరుగుల ఆధిక్యత లభించింది. ఓవర్ నైట్ బ్యాటర్ జైస్వాల్ డబుల్ సెంచరీ దిశగా వెళ్లే క్రమంలో జోసెఫ్ బౌలింగ్‌లో డి-శిల్వకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు టీ విరామ సమయానికి 2వికెట్ల నష్టానికి 32పరుగులు చేసింది.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 150పరుగులు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి)డి-శిల్వ (బి)జోసెఫ్ 171, రోహిత్ (సి)డి-శిల్వ (బి)అథంజే 103, శుభ్‌మన్ (సి)అథంజే (బి)వర్రికన్ 6, కోహ్లి (సి)అథంజే (బి)కార్న్‌వాల్ 76, రహానే (సి)బ్లాక్‌వుడ్ (బి)రోచ్ 3, జడేజా (నాటౌట్) 37, ఇషాన్ (నాటౌట్) 1, అదనం 24. (152.2ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 421పరుగులు. వికెట్ల పతనం: 1/229, 2/240, 3/350, 4/356, 5/405 బౌలింగ్: రోచ్ 24-6-50-1, జోసెఫ్ 18.2-2-80-1, కార్న్‌వాల్ 16-5-32-1, వర్రికన్ 45-4- 106-1, హోల్డర్ 18-5-40- 0, బ్రాత్‌వైత్ 9-0-21-0, అథంజే 16-2-53-1, రీఫర్ 4-0-16-0, బ్లాక్‌వుడ్ 2-0-4-9.










