Aug 01,2023 00:12

టారౌబ : భారత్‌, విండీస్‌ సిరీస్‌ సమరానికి సై అంటున్నాయి. తొలి వన్డేలో భారత్‌ నెగ్గగా, రెండో వన్డేలో విండీస్‌ పైచేయి సాధించింది. నిర్ణయాత్మక మూడో వన్డేలో నెగ్గిన సిరీస్‌ దక్కించుకోవాలని ఇరు జట్లు ఎదురు చూస్తున్నాయి. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు నేడు బరిలోకి దిగనుండటంతో భారత్‌ హాట్‌ ఫేవరేట్‌గా కనిపిస్తుంది. రెండో వన్డేలో విజయంతో కరీబియన్‌ కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. 2019 తర్వాత భారత్‌పై ఓ వన్డే విజయం సాధించిన విండీస్‌.. సిరీస్‌ విజయంతో సరికొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధమవుతోంది. భారత్‌, విండీస్‌ మూడో వన్డే రాత్రి 7 నుంచి డిడిస్పోర్ట్స్‌, జియో సినిమాలో ప్రసారం. జట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, జయ్‌దేవ్ ఉనద్కత్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్‌ కుమార్‌

విండీస్‌: షై హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్‌ కెప్టెన్), అలిక్ అథనేజ్, యనిక్ కారియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రోన్ హెట్‌మయేర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కేల్‌ మేయర్స్, మోతీ, జయ్‌దెన్ సీలెస్, రొమారియో షెఫెర్డ్, కెవిన్‌ సిన్‌క్లెయిర్‌, ఓషానె థామస్.