Jul 19,2023 13:21

ఢాకా : బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత మహిళా జట్టు రెండో వన్డేలో 228 పరుగులు చేసి బంగ్లా ముందు 229 పరుగుల భారీ టార్గేట్‌ ఉంచింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన బంగ్లా జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు స్మృతి మంధాన 36 పరుగులు చేయగా మరో ఓపెనర్‌ ప్రియా పునియా 7, వన్‌డౌన్‌లో వచ్చిన యాస్తిక భాటియా 15 పరుగులతో నిరాశపరిచారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ 88 బంతుల్లో 52 పరుగలు, , రోడ్రిగ్స్ 78 బంతుల్లో 86 పరుగలు చేశారు. మిగతా బ్యాటర్లలో హర్లీన్ డియోల్ 36 బంతుల్లో 25, దీప్తి శర్మ (0), అమంజోత్ కౌర్ 3, స్నేహ రాణా 1 పరుగు మాత్రమే చేశారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతున్‌, నహిదా అక్టర్‌ తలో రెండు వికెట్లు తీయగా, రబేయా ఖాన్‌, మరుఫా అక్టర్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

, ,, , , ,