Jul 26,2023 10:55

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : విద్యుత్‌ అమ్మకాల ద్వారా జెన్‌కో ఆదాయం గణనీయంగా పెరిగింది. జెన్‌కో మొత్తం ఆదాయం కూడా గతేడాది కన్నా పెరగడంతో నష్టాల్లోంచి ఆ సంస్థ లాభాల్లోకి చేరింది. తాజాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్‌ నివేదికను జెన్‌కో అధికారులు సిద్ధం చేశారు. దీని ప్రకారం ఆదాయ వ్యయాలు దాదాపుగా సమానంగా ఉన్నప్పటికీ స్వల్పంగా లాభాలు నమోదు అయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో జెన్‌కో మొత్తం ఆదాయం రూ. 12,968 కోట్లుగా నమోదైంది. అదే అంతకు ముందు 2021-22లో ఆదాయం రూ. 9,904 కోట్లుగా నమోదు కావడం గమనార్హం. అంటే ఒక్క ఏడాదిలో రూ. 3,065 కోట్లు ఆదాయం పెరిగింది. 2022-23 ఆదాయంలో విద్యుత్‌ అమ్మకాల ద్వారా రూ.10,497 కోట్లు ఆదాయం సమకూరగా, ఇతర మార్గాల ద్వారా మిగిలిన మొత్తం సమకూరింది. ఇక ఖర్చుల విభాగంలో 2022-23లో రూ.12,795 కోట్లుగా తేలిరది. గతేడాది ఈ వ్యయం 10,202 కోట్లు .

223