ఏలూరు : ప్రజలపై ప్రభుత్వం మోపిన అదనపు భారాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ... శుక్రవారం ఏలూరులోని సిపిఎం కార్యాలయంలో పలు పార్టీల నేతలు రౌండ్‌టేబుల్ సమావేశమయ్యారు. వక్తలు మాట్లాడుతూ ... పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, ట్రూ అప్ సర్దుబాటు, సబ్‌ఛార్జి, అదనపు చార్జీల పేరుతో స్లాబులు మార్చి ప్రజలపై విద్యుత్ భారాలను వేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు.










