దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి)నుంచి భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ)కు వచ్చే ఆదాయం పెరిగింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన ఐసిసి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐసిసి నుంచి ఇప్పటివరకు 22.4శాతం వాటా వస్తుండగా.. తాజాగా పెంపుదలతో బిసిసిఐ 38.5శాతం వాటా అందుకోనుంది. అంటే 72శాతం పెరిగిట్లెంది. ఈ పెంపుతో బిసిసిఐ ఏడాదికి 231 మిలియన్ల డాలర్లు (సుమారు రూ. 2,000 కోట్లు) అందుకోనుంది. ఐసిసికి భారీగా ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న బిసిసిఐకి తిరిగి అదే స్థాయిలో డబ్బులు ఇవ్వాలని ఐసిసి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఐసిసి నిర్ణయంపై బిసిసిఐ సెక్రటరీ జై షా హర్షం వ్యక్తం చేశాడు.










