Jun 01,2023 16:54

ప్రజాశక్తి-రామగిరి(సత్యసాయిజిల్లా) : శ్రీసత్య సాయి జిల్లా ఇన్‌ ఛార్జ్‌ డీఈఓ మీనాక్షి గురువారం రామగిరి మండలం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఇంఛార్జి డీఈఓ యు.మీనాక్షి, ఎం.ఈ.ఓ గోపాల్‌ ప్రభుత్వ పాఠశాలలు తనిఖీ ల్లో భాగంగా రామగిరి మండలం వెళ్లారు. రామగిరి నుంచి తిరిగి వెళుతున్న సందర్భంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు.