Sep 06,2023 15:57

న్యూఢిల్లీ : సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు ప్రత్యే పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఎలాంటి ఎజెండా జాబితా లేకుండా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరగనున నేపథ్యంలో పార్లమెంటులో చర్చించాల్సిన పలు ఎజెండాలపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియగాంధీ ప్రధాని మోడీకి బుధవారం లేఖ రాశారు. ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదింపులు లేకుండానే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో చర్చించే ఎజెండా గురించి మాకెవరికీ తెలియదు. ఐదురోజులూ ప్రభుత్వ వ్యవహారాలకే కేటాయించినట్లు తమకు తెలియజేసినట్లు సోనియాగాంధీ తన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సెషన్‌లో కేంద్ర- రాష్ట్ర సంబంధాలు, మతతత్వం, మణిపూర్‌ పరిస్థితి, చైనా సరిహద్దు వివాదంతో సహా పలు అంశాలపై చర్చలు జరపాలని సోనియా తన లేఖలో కోరారు. సహకార స్ఫూర్తితో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలని కోరుకుంటున్నట్లు సోనియా తన లేఖలో పేర్కొన్నారు.