Sep 08,2023 13:18

ప్రజాశక్తి-హాలహర్వి (కర్నూలు) : హాలహర్వి మండలం గూళ్యంలో రహదారి గుండా అక్రమ కట్టడాలను అరికట్టాలని ఎంఆర్పిఎస్‌ మండల కన్వీనర్‌ ఎల్లప్ప డిమాండ్‌ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎల్లప్ప మాట్లాడుతూ ... గూళ్యంలోని శ్రీ గాదిలింగేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందిన క్షేత్రం అని, ప్రతి ఏడాది శివరాత్రి తరువాత పంచమినాడు జోడు రథోత్సవం వైభవంగా జరుగుతుందని చెప్పారు. ఈ రథోత్సవం తిలకించడానికి లక్షల్లో భక్తులు వచ్చి మొక్కు తీర్చుకుంటారన్నారు. అలాంటి ఈ దేవాలయం ముందు ప్రధాన రహదారిలో అక్రమంగా ఇల్లు కట్టుకొని రేకులు షెడ్డు వేసి నిర్మించుకున్నారని ఆరోపించారు. గ్రామంలో రాజకీయాలకు అతీతంగా అక్రమ కట్టడాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్య తీసుకోవాలని కోరారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోతే శ్రీ గాదిలింగేశ్వర స్వామి రథోత్సవం లాగడానికి భక్తాదులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్నారు. అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ కట్టడాలపై జిల్లా ఉన్నతాధికారుల దఅష్టికి తీసుకెళతామన్నారు. ఈ సమావేశంలో దళిత సంఘం నాయకులు గోవింద్‌, గాదిలింగప్ప, విజరు, నవీన్‌ పాల్గొన్నారు.